కేరళ సీఎంగా సతీశన్... స్పందించిన కేసీ వేణుగోపాల్

  • అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య
  • తనకు పార్టీ, కార్యకర్తలే ముఖ్యమన్న కేసీ వేణుగోపాల్
  • అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను నియమించాలన్న పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అంగీకరించారు. ముఖ్యమంత్రి పదవికి తాను ప్రధాన అభ్యర్థులలో ఒకరిగా ఉన్నప్పటికీ, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తనకు పార్టీ, కార్యకర్తలే ముఖ్యమని, హైకమాండ్ ఆదేశాలే శిరోధార్యమని అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్‌ను ఎంపిక చేసిన అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.

తనతో పాటు ఎంతోమంది ముఖ్యమంత్రి పదవిని ఆశించారని వెల్లడించారు. అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుందని, సతీశన్ ఎంపికపై సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు. పార్టీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించిందని అన్నారు. కేరళ ముఖ్యమంత్రిగా ఎంపికైన సతీశన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

KC Venugopal
VD Satheesan
Kerala Chief Minister
Kerala Politics
Congress
Kerala
Chief Minister Selection

More Telugu News